Rana Daggubati : షారుఖ్, హృతిక్‌ లను ప్రేక్షకులు చూడాలని అనుకోవడం లేదు.. రానా వైరల్ కామెంట్స్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా.. ప్రేక్షకుడు ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నాడు. షారుఖ్, హృతిక్‌ లను ప్రేక్షకులు చూడాలని అనుకోవడం లేదు అంటూ వైరల్ కామెంట్స్ చేశాడు.

Rana Daggubati : షారుఖ్, హృతిక్‌ లను ప్రేక్షకులు చూడాలని అనుకోవడం లేదు.. రానా వైరల్ కామెంట్స్!

Rana Daggubati viral comments on Shah Rukh Khan and Hrithik Roshan

Updated On : June 7, 2023 / 9:26 PM IST

Rana Daggubati : టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి అందరి హీరోలా కమర్షియల్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు. కేవలం నటుడు గానే కాదు, లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు వారసత్వాన్ని అందుకున్న రానా.. సినిమా రంగాన్ని మరింత పైకి ఎలా తీసుకు వెళ్లాలని ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచనతోనే నిర్మాతగా ఇండస్ట్రీకి వద్దాం అనుకునే కొత్త టాలెంట్ ని గుర్తించి, ప్రోత్సహించి.. ముందుకు నెడుతుంటాడు. కాగా రానా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

Anupama Parameswaran : సినిమా బండి దర్శకుడితో అనుపమ కొత్త సినిమా.. ఈసారి ఏ అవార్డు అందుకుంటారో?

ఆ ఇంటర్వ్యూలో రానా చిత్ర పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులు గురించి మాట్లాడాడు. “సినీ పరిశ్రమలో బాహుబలి (Bahubali) ఓ అద్భుతం. ఆ చిత్రం తరువాత సినిమా చూసే విధానం మారింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుడు ఒక కొత్తదనాన్ని కోరుకుంటాడు. దానికి తగట్టు సినిమా రంగంలో మార్పులు రావాలి. ప్రతి ఒక్కరిలో ఓ ప్రత్యేకతని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కొత్తగా వచ్చే వారిలో మరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) ని చూడాలని వాళ్లు అనుకోవడం లేదు. ఎందుకంటే హృతిక్ అండ్ షారుఖ్ ని వాళ్ళు ఆల్రెడీ చేసేశారు. మనం ఏంటనేదే వాళ్లు చూస్తున్నారు” అంటూ రానా చెప్పుకొచ్చాడు.

Adipurush : ఆదిపురుష్ సినిమాకి 10 వేల టికెట్స్‌ని ఫ్రీగా ఇస్తున్నారు.. కానీ వాళ్ళకి మాత్రమే!

అలాగే నిర్మాతగా తన కెరీర్ గురించి కూడా మాట్లాడాడు. ‘బొమ్మలాట’ (Bommalata) ఒక చిన్న చిత్రంతో నిర్మాతగా మారిన రానా.. మొదటి సినిమాతోనే రెండు నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాడు. అయితే ఒక చిన్న సినిమా విడుదల కావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుంది. అందుకనే తాను చిన్న చిత్రాలను నిర్మించాలని, ఇండస్ట్రీకి వద్దాం అనుకునే కొత్త టాలెంట్ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కాగా ఇటీవల రానా పరేషాన్ (Pareshan) అనే చిన్న సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.