యష్ అభిమాని ఆత్మహత్యాయత్నం

బ‌ర్త్‌డే ప్రతీ సంవత్సరం వస్తుంది. కానీ, ప్రాణం పోతే రాదు అంటూ చాలా ఆవేదనతో చెప్పాడు యష్.

  • Published By: sekhar ,Published On : January 9, 2019 / 09:45 AM IST
యష్ అభిమాని ఆత్మహత్యాయత్నం

Updated On : January 9, 2019 / 9:45 AM IST

బ‌ర్త్‌డే ప్రతీ సంవత్సరం వస్తుంది. కానీ, ప్రాణం పోతే రాదు అంటూ చాలా ఆవేదనతో చెప్పాడు యష్.

కన్నడ రాకింగ్ స్టార్ యష్, కె.జి.ఎఫ్ మూవీతో మిగతా సినీ పరిశ్రమలతో పాటు, ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. యూత్‌లో అతనికి మంచి క్రేజ్ వచ్చింది. జనవరి 8న యష్ బ‌ర్త్‌డే. కన్నడ రెబల్ స్టార్, తనకి అత్యంత ఆప్తుడు అయిన అంబరీష్ మరణించిన నేపథ్యంలో, యష్ ఈసారి బ‌ర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే తనకి శుభాకాంక్షలు చెప్పడానికి పెద్ద ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి వచ్చారు. యష్‌ని కలవడానికి అతని సెక్యూరిటీ లోపలికి అనుమతించక పోవడంతో మనస్థాపం చెంది, బెంగుళూరుకు చెందిన రవి అనే వీరాభిమాని ఆత్మహత్యాయత్నం చేసాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ అయ్యారు.

వెంటనే అతణ్ణి హాస్పిటల్ అడ్మిట్ చేసారు. అతని శరీరం దాదాపు 75శాతం కాలిపోయినట్టు డాక్టర్స్ చెబుతున్నారు. తీవ్ర ఆందోళనకు గురైన యష్, రవిని చూడ్డానికి హాస్పిటల్‌కి వెళ్ళి, రవిని పరామర్శించిన తర్వాత, తన అభిమాని ఆత్మహత్యాయత్నం విషయంపై యష్ మీడియాతో మాట్లాడాడు. అభిమానం ఉండొచ్చుకానీ, మరీ ప్రాణాల మీదకు తెచ్చుకునేంత పిచ్చి ఉండకూడదు. లేదు, ఇలా చేస్తేనే అభిమానం అంటే కనక నాకలాంటి అభిమానం, అభిమానులూ వద్దంటాను. నేనీ సంవత్సరం బ‌ర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవట్లేదని ముందే చెప్పాను. అతను చేసింది చాలా తప్పు, బ‌ర్త్‌డే ప్రతీ సంవత్సరం వస్తుంది, కానీ, ప్రాణం పోతే రాదు అంటూ చాలా ఆవేదనతో చెప్పాడు యష్.

వాచ్ వీడియో…