Yashmi Gowda : వద్దని చెప్పినా హగ్ చేసుకుంటున్నాడు.. ఏడుస్తూ బిగ్ బాస్‌లో అతనిపై యష్మి సంచలన వ్యాఖ్యలు..

తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో యష్మి మణికంఠపై సంచలన ఆరోపణలు చేసింది.

Yashmi Gowda Sensational Comments on Naga Manikanta in Bigg Boss Watch Promo Here

Yashmi Gowda : బిగ్ బాస్ మూడో వారం సాగుతుంది. నిన్నే మూడో వారం నామినేషన్స్ అయ్యాయి. ఈ నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు బాగానే ఫైర్ అయ్యారు. ముఖ్యంగా యష్మి, మణికంఠ మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో యష్మి నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం మణికంఠని నామినేట్ చేస్తాను అని చెప్పింది.

అయితే తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా ఇందులో యష్మి మణికంఠపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రోమోలో.. మణికంఠ వచ్చి యష్మిని వెనక నుంచి హగ్ చేసుకొని.. అదంతా నామినేషన్స్ వరకే ఎక్కువ ఆలోచించకు అని చెప్తాడు. దీంతో యష్మి సరే వదిలేయ్ అని చెప్తుంది. మణికంఠ వెళ్ళిపోయాక.. నా వల్ల కావట్లేదు బిగ్ బాస్, నాకు కోపం వస్తుంది అంటూ ఏడ్చింది యష్మి.

Also Read : Photriya Venky : శంకర్ దాదా MBBS సినిమాలో స్వామి గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎంత ఎదిగిపోయాడో తెలుసా..?

అనంతరం పృథ్వి వద్దకు వెళ్లి.. నాకు మెంటల్ టార్చర్ లా ఉంది. వచ్చి హగ్ చేయడం, అది నాకు కంఫర్టబుల్ గా లేదు. ఆల్రెడీ అతనికి వద్దని చెప్పినా వినట్లేదు. మణికంఠ ఫేక్. నేను ఉన్నంతకాలం నామినేషన్స్ లో అతని పేరు తీస్తాను అని చెప్పింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. అలాగే ప్రోమోలో రెండు టీమ్స్ కి ఒక టాస్క్ ఇవ్వగా ఆ టాస్క్ లో మళ్ళీ రెండు టీమ్స్ కొట్టుకున్నాయి. మీరు కూడా నేటి ప్రోమో చూసేయండి..