Photriya Venky : శంకర్ దాదా MBBS సినిమాలో స్వామి గుర్తున్నాడా? ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎంత ఎదిగిపోయాడో తెలుసా..?
శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవి రూమ్ మేట్ గా, చిరంజీవి బెంచ్ మేట్ గా స్వామి అనే ఓ బక్క పలుచని కుర్రాడు కనిపిస్తాడు.

Do You Remember Chiranjeevi Shankar Dada MBBS Swami Character Venky Here Details about him
Photriya Venky : చిరంజీవి సూపర్ హిట్ సినిమాల్లో శంకర్ దాదా MBBS ఒకటి. ఈ సినిమాలో చిరంజీవి రూమ్ మేట్ గా, చిరంజీవి బెంచ్ మేట్ గా స్వామి అనే ఓ బక్క పలుచని కుర్రాడు కనిపిస్తాడు. ఆల్మోస్ట్ సినిమాలో చాలా సీన్స్ లో కనిపిస్తాడు స్వామి అనే క్యారెక్టర్. అక్కడక్కడా నవ్విస్తాడు కూడా. ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆ స్వామి ఏం చేస్తున్నాడు..? అతని అసలు పేరేంటో తెలుసా?
Also Read : Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ముందు కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేసారని తెలుసా..?
స్వామి అసలు పేరు వెంకీ. అతను ఫోటోగ్రాఫర్ గా పనిచేసేవాడు. ఇప్పుడు స్టార్ ఫోటోగ్రాఫర్. ఫోట్రియా స్టూడియోస్ అనే పేరుతో ఓ సంస్థని స్థాపించాడు. సెలబ్రిటీలకు ఫోటోషూట్స్, ఈవెంట్స్ కి, వెడ్డింగ్స్ కి ఫొటోస్ తీస్తారు. అలాగే ఫోటోగ్రఫీ క్లాసెస్ కూడా చెప్తాడు వెంకీ. ఫోటోగ్రఫీలో అనేక అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి, సునీత.. ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీలకు ఫోటోగ్రాఫర్ గా పని చేసాడు వెంకీ.
ప్రస్తుతం తన కెరీర్ లో ఫోటోగ్రఫీ క్లాసెస్, ఈవెంట్స్, బిజినెస్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. వెంకీకి పెళ్లయి ఒక బాబు కూడా ఉన్నాడు. ఇటీవల వెంకీ పవన్ కళ్యాణ్ ని కలవడంతో వైరల్ అయ్యాడు. దీంతో శంకర్ దాదా MBBS సినిమాలోని వెంకీ ఇతనే అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయాడు అని షాక్ అవుతున్నారు. ఇప్పటికి ఫోటోగ్రాఫర్ గా సినీ పరిశ్రమతో మంచి సంబంధాలే ఉన్నాయి వెంకీకి. మరి ఫ్యూచర్ లో మళ్ళీ ఏదైనా సినిమాలో నటుడిగా కనిపిస్తాడేమో చూడాలి.