Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ముందు కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేసారని తెలుసా..?

ఖైరతాబాద్ గణేశుడి వద్ద కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేసారని తెలుసా..

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ముందు కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేసారని తెలుసా..?

Do You Know Kamal Haasan Movie Shooting done at Khairatabad Ganesh Idol Here the Details

Updated On : September 17, 2024 / 9:41 AM IST

Khairatabad Ganesh : హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. హైదరాబాద్ లోనే భారీ విగ్రహంగా ఎన్నో ఏళ్లుగా వినాయక చవితిని గ్రాండ్ గా చేస్తున్నారు ఖైరతాబాద్ లో. గణేష్ నవరాత్రులు మొదలయినప్పటి నుంచి నిమజ్జనం వరకు ఖైరతాబాద్ వినాయకుడి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇక నిమజ్జనం రోజు అయితే అందరి కళ్ళు ఖైరతాబాద్ గణేశుడి మీదే ఉంటాయి.

నేడు వినాయక నిమజ్జనం సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడు ఆల్రెడీ నిమజ్జనానికి బయలుదేరాడు. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ఆల్రెడీ షూట్ చేసిన పలు పాత వీడియోలు తీసుకొని కొన్ని సినిమాల్లో చూపించిన సంగతి తెలిసిందే. కానీ ఖైరతాబాద్ గణేశుడి వద్ద కమల్ హాసన్ సినిమా షూటింగ్ చేసారని తెలుసా..

Also Read : Suhas : మూడు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని తన సినిమాని పట్టించుకోని సుహాస్.. ఏం జరిగింది..?

దివంగత లెజెండరీ దర్శకులు K విశ్వనాధ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సాగర సంగమం సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో ఒక సీన్ కమల్ హాసన్ ఓ భారీ వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అది ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన విగ్రహమే. ఆ ఏరియా కూడా ఖైరతాబాదే. అది 1983 ఖైరతాబాద్ విగ్రహం. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ముందు కమల్ హాసన్ తో డ్యాన్స్ సీన్ చేయించారు K విశ్వనాధ్.

Do You Know Kamal Haasan Movie Shooting done at Khairatabad Ganesh Idol Here the Details

అయితే సాగర సంగమం సినిమా 1983 జూన్ లో రిలీజ్ అయింది. ఆ సంవత్సరం వినాయకచవితి సెప్టెంబర్ లో వచ్చింది. దీంతో ఆ సీన్ కోసం ముందే 1983 ఖైరతాబాద్ వినాయకుడిని తయారుచేయించారు అని పలువురు వ్యాఖ్యానిస్తారు.

Do You Know Kamal Haasan Movie Shooting done at Khairatabad Ganesh Idol Here the Details