Yatra 2 Movie Unit gives Clarity on Pawan Kalyan Sharmila Nara Lokesh Characters in Movie
Yatra 2 Movie : 2019 ఎలక్షన్స్ ముందు వైఎస్సార్(YSR) బయోపిక్ గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2 సినిమా తీసుకొస్తున్నారు. తమిళ నటుడు జీవా(Jiiva) ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో నటిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ మూవీని త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్, టీజర్ రిలీజ్ చేయగా సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
యాత్రలో వైఎస్సార్ బయోపిక్ గా చూపిస్తే యాత్ర 2 వైఎస్ జగన్(YS Jagan) బయోపిక్ గా రానుంది. వైఎస్సార్ మరణించే ముందు పరిస్థితులతో పాటు మరణించాక జరిగిన రాజకీయాలు, జగన్ జైలు జీవితం, పాదయాత్ర, జగన్ సీఎం అవ్వడం.. కథాంశంతో రానుంది యాత్ర 2. యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.
Also Read : Prabhas : రేపు పొద్దున్నే బీమవరంలో.. కోడి పందాల వద్ద డిజిటల్ ప్రభాస్ జాతర.. మారుతి సినిమా కోసం..
అయితే ఆర్జీవీ వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా, షర్మిల.. ఇలా రాజకీయాల్లోని చాలామంది పాత్రలు పెట్టి వైరల్ చేశాడు. మరి యాత్ర 2 లో కూడా అన్ని పాత్రలు ఉంటాయా అని కొంతమందికి సందేహం రాగా చాలా పాత్రలు ఉండవు అనే చిత్రయూనిట్ నుంచి సమాధానం వచ్చింది. యాత్ర 2 సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్..మిగిలిన పాత్రల్లో పలువురు నటిస్తున్నారు. అయితే యాత్ర 2 సినిమాలో పవన్ కళ్యాణ్, షర్మిల, నారా లోకేష్ పాత్రలు ఉండవని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో కేవలం జగన్, వైఎస్సార్ మధ్య భావోద్వేగం, పాదయాత్ర, సీఎం అవ్వడం.. లాంటి అంశాలతోనే ఉంటుందని, రాజకీయాల జోలికి ఎక్కువగా పోకుండా ఎమోషనల్ గా టచ్ చేస్తారని తెలుస్తుంది.