Yellamma movie glimpse released.
Yellamma Glimpse: బలగం సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు హాస్యనటుడు వేణు యెల్దండి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ దర్శకుడు ‘ఎల్లమ్మ(Yellamma Glimpse)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయం అవబోతున్నాడు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
Pushpa 2: పుష్ప 2 జపాన్ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్- రష్మిక.. ఫొటోలు వైరల్
నిజానికి ఎల్లమ్మ సినిమా కోసం చాలా మంది హీరోలను అనుకున్నారు. ముందుగా ఈ కథ నేచురల్ స్టార్ నాని వద్దకు వెళ్ళింది. కానీ, అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు నాని. ఆ తరువాత నితిన్ ని కూడా అనుకున్నారు. అంతా సెట్ అయ్యింది ఇక షూటింగ్ కి వెళ్లడమే ఆలస్యం అనుకున్నారు. కానీ, నితిన్ వరుస ప్లాప్స్ లో ఉండటం వల్ల ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుందని నితిన్ ని ఈ సినిమా నుంచి తప్పించారు.
ఆ తరువాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని కూడా అనుకున్నారు. కానీ, ఫైనల్ గా ఈ సినిమాలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ను ప్రధాన పాత్ర కోసం తీసుకున్నారు. నిజానికి చాలా కాలం క్రితమే దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలి కానీ ఫైనల్ గా ఎల్లమ్మ సినిమా ద్వారా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇంతకాలం తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఏమేరకు మెప్పిస్తాడు అనేది చూడాలి.