Yendira Ee Panchayathi Glimpse : ఆకట్టుకుంటోన్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ గ్లింప్స్
గ్రామీణ నేపథ్యంతో కూడిన ప్రేమ కథలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథల నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వస్తున్నప్పటికీ తమదైన శైలిలో కొత్తదనంతో పాటు అందంగా చూపిస్తూ నేటి మేకర్లు విజయాలను సొంతం చేసుకుంటున్నారు.

Yendira Ee Panchayathi Glimpse
Yendira Ee Panchayathi : గ్రామీణ నేపథ్యంతో కూడిన ప్రేమ కథలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథల నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వస్తున్నప్పటికీ తమదైన శైలిలో కొత్తదనంతో పాటు అందంగా చూపిస్తూ నేటి మేకర్లు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayathi)అనే చిత్రం కూడా రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గంగాధర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. భరత్(Bharath), విషికా లక్ష్మణ్(Vishika Laxman)లు హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఊరి వాతావరణం, ఊర్లోని పలు భిన్న మనస్తత్వాలు, లక్షణాలున్న మనుషుల మధ్య సాగే సినిమా అని చెప్పేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Vishika-Bharath
‘మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘ఎవరే.. ’అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం.. ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. (నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది.
Mega 157 : మెగా 157.. సోషియో ఫాంటసీ కథతో మరింత కొత్తగా రాబోతున్న మెగాస్టార్
ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల మాటలు అందిస్తుండగా కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.