వైరల్ అవుతున్న డార్లింగ్ న్యూ ఫోటో

సాహో సెట్‌లో నీల్ నితిన్, ప్రభాస్, డైరెక్టర్ సుజీత్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

  • Published By: sekhar ,Published On : January 8, 2019 / 10:17 AM IST
వైరల్ అవుతున్న డార్లింగ్ న్యూ ఫోటో

సాహో సెట్‌లో నీల్ నితిన్, ప్రభాస్, డైరెక్టర్ సుజీత్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్‌లో సాహో సినిమా చేస్తూనే, మరోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ (వర్కింగ్ టైటిల్) సినిమా కూడా చేస్తున్నాడు. సాహోలో డార్లింగ్ పక్కన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా సెట్‌లో నీల్ నితిన్, ప్రభాస్, డైరెక్టర్ సుజీత్ కలిసి తీసుకున్న సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆన్ లొకేషన్‌లో ప్రభాస్, సుజీత్‌లతో కలిసున్న పిక్‌‌‌‌ని నీల్ నితిన్, ఇది చాలా అద్భుతమైన రోజు అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేసాడు.

డార్లింగ్‌ని అలా చూసే సరికి ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతూ ఆ ఫోటోని తెగ షేర్ చేసేస్తున్నారు. అలాగే, నీల్ నితిన్ ముఖేష్ ఫాదర్ కూడా ప్రభాస్‌తో పిక్ తీసుకుని, మీట్ దిస్ ఇన్ క్రిడబుల్ యంగ్ మ్యాన్, సో హంబుల్, సో డౌన్ టు ఎర్త్, సో రెస్పెక్ట్‌ ఫుల్ అండ్ వాట్ ఏ గ్రేట్ యాక్టర్… నో వండర్ హి ఈజ్ ఒన్ మిలియన్.. గాడ్ బ్లెస్ యూ ప్రభాస్.. థ్యాంక్యూ ఫర్ దిస్ ఫ్యాన్ మూమెంట్ అంటూ, ప్రభాస్ మంచితనానికి ముగ్దుడవుతూ ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సాహో ఆగష్టు 15న రిలీజ్ కానుంది.