తారక్ బర్త్ డే మోషన్ పోస్టర్ చూశారా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కామన్ డీపీ, మోషన్ పోస్టర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 9, 2020 / 02:01 PM IST
తారక్ బర్త్ డే మోషన్ పోస్టర్ చూశారా!

Updated On : May 9, 2020 / 2:01 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కామన్ డీపీ, మోషన్ పోస్టర్ రిలీజ్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డీపీ, మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఈ సాయంత్రం తారక్ బర్త్ డే కామన్ డీపీ అలాగే మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆన్‌లైన్‌లో బర్త్ డే కామన్ డీపీ, మోషన్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులు, నెటజన్ల నుండి మంచి స్పందన వస్తోంది.

తారక్ సినిమాలలోని పాపులర్ పిక్స్ తీసుకుని సాలిడ్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో రూపొందించిన మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రంలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమాలో కొమరం భీం గా కనిపించనున్న సంగతి తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ నుండి తారక్ అభిమానులకు రాజమౌళి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడో చూడాలి మరి.