Young Directors: టైం వేస్ట్ చేస్తున్న దర్శకులు.. ఒక్కో సినిమా కోసం ఏళ్లతరబడి వెయిటింగ్
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్(Young Directors) ఒక్కో సినిమా కోసం ఏకంగా ఏళ్లతరబడి సమయం తీసుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారట.
Young Tollywood directors are taking years to complete a single film
Young Directors: నేటి టాలీవుడ్లో కొత్త తరం దర్శకులు తమ అరంగేట్రంతోనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నారు. సుజీత్, బుచ్చిబాబు సన, శ్రీకాంత్ ఓదెల వంటి డైరెక్టర్స్ ఒకే ఒక్క సినిమాతో తామేంటో నిరూపించుకుని, ఇండస్ట్రీ చూపును తమవైపు తిప్పుకున్నారు. అయితే, ఈ యువ దర్శకులు(Young Directors) మొదటి సినిమాతో సంపాదించుకున్న క్రేజ్‌ను నిలబెట్టుకోవడంలో మాత్రం వేగం ప్రదర్శించలేకపోతున్నారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చి సినిమాలు త్వరగా పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, వీరి కెరీర్లో కనిపిస్తున్న భారీ విరామాలు సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
Raavanam: ‘రావణం’ అల్లు అర్జున్ తోనే.. ప్రశాంత్ నీల్ ను సెట్ చేసిన దిల్ రాజు
ఒకప్పుడు దర్శకులు ఏడాదికి కనీసం ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరించేవారు, కానీ ఇప్పుడు ఐదేళ్లకు ఒక సినిమా రావడం కూడా గగనమైపోతోంది. ఈ జాప్యానికి ప్రధాన కారణం భారీ ప్రాజెక్టుల మోజు లేదా స్టార్ హీరోల డేట్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కావొచ్చు. ఉదాహరణకు, సుజీత్ పన్నెండేళ్ల కాలంలో కేవలం మూడు సినిమాలను మాత్రచేశాడు. బుచ్చిబాబు సన ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కానీ. రెండో సినిమా కోసం ఐదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అలాగే శ్రీకాంత్ ఓదెల దసరా తరువాత దాదాపు రెండుళ్లు విరామం తీసుకొని ఇప్పుడు ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. ఇక రాహుల్ సాంకృత్యన్ విషయానికి వస్తే, శ్యామ్ సింగారాయ్ విడుదలైన నాలుగేళ్ళ తరువాత ఇప్పుడు రణబాలి సినిమా చేస్తున్నాడు.
ఇలా ఒక్కో సినిమా కోసం సుదీర్ఘ సమయం తీసుకోవడం వల్ల వారిలోని సృజనాత్మకతకు సరైన వేదిక దొరకడం లేదు. కథల మీద అతిగా కసరత్తు చేయడం మంచిదే అయినా, అది ప్రేక్షకులకు సినిమాను దూరం చేసేలా ఉండకూడదు. ఈ సుదీర్ఘ విరామాలు కేవలం దర్శకులకే కాకుండా, మొత్తం చిత్ర పరిశ్రమకే నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కొత్త దర్శకులు వేగంగా సినిమాలు చేస్తే పరిశ్రమలో కొత్త ఆలోచనలు, సరికొత్త కథనాలు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. అలా కాకుండా వీరంతా ఒక్కో ప్రాజెక్టుకు ఐదేళ్లు కేటాయిస్తే, వారి ప్రతిభ కేవలం అతి తక్కువ చిత్రాలకే పరిమితమైపోతుంది అనేది నెటిజన్స్ మాట. మరి ఇకనైనా యువ దర్శకులు వేగంగా సినిమాలు చేస్తారా అనేది చూడాలి.
