బాలయ్య అల్లుడు ఎంత మారిపోయాడో.. ఈ హీరోని గుర్తు పట్టారా!
యంగ్ హీరో నారా రోహిత్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

యంగ్ హీరో నారా రోహిత్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఈ ఫొటోలో కనిపిస్తున్న యంగ్ హీరోని గుర్తు పట్టారా?.. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ కుర్ర హీరో సడెన్‌గా స్లిమ్‌గా కనిపించే సరికి గుర్తు పట్టడం కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ఎవరనేది తెలిశాక మాత్రం షాక్ అవడం ఖాయం. ఇంతకీ ఈ హీరో ఎవరయ్యా అంటే.. నారా రోహిత్.. సర్‌ప్రైజ్ అయ్యారు కదూ!..
రెండేళ్లపాటు పట్టుదలతో వర్కవుట్లు చేసి దాదాపు సగానికి సగం బరువు తగ్గిపోయాడు రోహిత్. స్లిమ్ అండ్ ట్రిమ్‌గా మీసంతో ఉన్న నారా రోహిత్ తాజా ఫొటో చూస్తే అతణ్ని గుర్తుపట్టడానికి ఎవరైనా కాస్త టైమ్ తీసుకోవాల్సిందే. తన తర్వాతి సినిమా కోసమే నారా రోహిత్ ఇలా లుక్ మార్చుకున్నాడట. ప్రత్యేక ట్రైనర్ సహాయంతో వర్కౌట్స్ చేసి ఇలా మేకోవర్ అయ్యాడు. లాక్‌డౌన్ తర్వాత నారా రోహిత్ కొత్త సినిమా ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.