Harsha Sai : హైకోర్టును ఆశ్రయించిన హర్షసాయి.. ముందస్తు బెయిల్ కోసం..

తాజాగా యూట్యూబర్ హర్ష సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు.

Youtuber Harsha Sai filed an anticipatory bail petition in Telangana High Court

Harsha Sai : ఇటీవలే యూట్యూబర్ హర్షసాయి పై ఓ మహిళా నటి, నిర్మాత లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు తర్వాత హర్ష సాయి కనపడకుండా పారిపోయాడు అని వార్తలు వచ్చాయి. పోలీసులు కూడా హర్ష సాయి దొరక్కపోవడంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

Also Read : Harsha Sai : హర్షసాయి దేశం వదిలి పారిపోయాడు.. వాళ్లపై కూడా కేసు నమోదు.. బాధితురాలి లాయర్ సంచలన వ్యాఖ్యలు..

అయితే తాజాగా యూట్యూబర్ హర్ష సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసాడు. హర్ష సాయి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరగనుంది.