Harsha Sai : హర్షసాయి దేశం వదిలి పారిపోయాడు.. వాళ్లపై కూడా కేసు నమోదు.. బాధితురాలి లాయర్ సంచలన వ్యాఖ్యలు..

బాధితురాలు దాపున లాయర్ నాగూర్ బాబు, నిర్మాత బాలచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు.

Harsha Sai : హర్షసాయి దేశం వదిలి పారిపోయాడు.. వాళ్లపై కూడా కేసు నమోదు.. బాధితురాలి లాయర్ సంచలన వ్యాఖ్యలు..

Women Producer Lawyer Comments on Harsha Sai

Updated On : October 6, 2024 / 12:31 PM IST

Harsha Sai : ఇటీవల హర్షసాయిపై ఓ మహిళా నటి, నిర్మాత లైంగిక వేధింపులు చేసారని, ఓ సినిమా కాపీ రైట్ విషయంలో తనని వేధించాడని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి హర్ష సాయి కనిపించకపోవడంతో ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి హర్ష సాయిపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. అయితే ఇటీవల బాధితురాలు మాట్లాడిన ఆడియో అంటూ హర్ష సాయికి అనుకూలంగా కొంతమంది ప్రచారం చేసారు. దీనిపై బాధితురాలు దాపున లాయర్ నాగూర్ బాబు, నిర్మాత బాలచంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పందించారు.

Also Read : Prakash Raj : నీ వల్ల కోటి రూపాయల నష్టం.. ప్రకాష్ రాజ్ పై నిర్మాత ఫైర్..

మీడియా ముందు బాధితురాలి లాయర్ నాగూర్ బాబు మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడ చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది ఎవరికీ తెలియదు. రెండు కోట్ల కోసమని కొంతమంది చేస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. హర్ష సాయి ప్రస్తుతం దేశం వదిలి పారిపోయాడు. అతను ఇక్కడ లేకపోయినా తనకి సపోర్ట్ గా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇన్ స్టాగ్రామ్ పేజీలు పనిచేస్తున్నాయి. బాధితురాలు పైన లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్ తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేసారు. ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ డిలీట్ చేయాలని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాము. ఎఫ్ఐఆర్లో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్ తో బాధితురాలని మానసికంగా బాధ పెడుతున్నారు. నిజనిజాలు తెలియకుండా బాధితురాలిని ఇబ్బంది పెడుతున్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్.. దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్.. మరికొంతమందిపై కేసు నమోదు చేసాము అని తెలిపారు.

ఇక నిర్మాత బాలచంద్ర మాట్లాడుతూ.. బాధితురాలు ఎంతో ధైర్యంగా వచ్చి కేసు పెట్టింది. కానీ ఆ తర్వాత రోజు నుంచే హర్ష సాయి ఇబ్బంది పెడుతున్నాడు అని తెలిపారు.