సినిమా ఇండస్ట్రీలోకి మరో వారసుడు వస్తున్నాడు

Yuva Ranadheera Kanteerava: కన్నడ చిత్ర పరిశ్రమలో మరో స్టార్ కుటుంబం నుండి వారసుడు వస్తున్నాడు. దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీ తరఫున థర్డ్ జనరేషన్ నుండి రాజ్ కుమార్ మనవడు యువ రాజ్‌కుమార్ సినీ రంగంలోకి అడుగు పెడుతున్నాడు.
రాజ్ కుమార్ జయంతి సందర్భంగా యువ రాజ్‌కుమార్ నటిస్తున్న ‘యువ రణధీర కంఠీరవ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు, 5 నిమిషాల 11 సెకన్ల వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియో చూస్తుంటే సినిమా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందని అర్థమవుతుంది.
అలాగే వీడియోలో యువ రాజ్‌కుమార్ అనర్గళంగా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలతోనూ అలరించాడు. పునీత్ రుద్రాంగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.