పరశురామ్‌కి హీరో దొరికాడు : నాగ చైతన్య 20
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, యువ దర్శకుడు పరశురామ్(బుజ్జి) కాంబోలో 14 రీల్స్ కొత్త సినిమా..

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, యువ దర్శకుడు పరశురామ్(బుజ్జి) కాంబోలో 14 రీల్స్ కొత్త సినిమా..
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఈ శుక్రవారం ‘వెంకీ మామ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దగ్గుబాటి, అక్కినేని మామా అల్లుళ్ల నటనకు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. శనివారం కొత్త సినిమా ప్రకటించాడు చైతు. ‘గీత గోవిందం’ తో రూ.100 కోట్ల సినిమా తర్వాత కొద్ది గ్యాప్ తీసుకుని యువ దర్శకుడు పరశురామ్(బుజ్జి) చైతుతో సినిమా చేయనున్నాడు.
సూపర్ హిట్ ఫిలింస్ అందించిన 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 20వ సినిమా కావడం విశేషం. 19వ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.
సాయి పల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. నాగ చైతన్య, పరశురామ్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.