భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. మరి కొందరికి తీవ్రగాయాలు

క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో..

Tamil-Nadu-Fire-Accident

తమిళనాడులోని విరుద నగర్ జిల్లాలో టపాకాయల గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పదిమంది మృతి చెందగా, మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అందుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో గోడౌన్లో మొత్తం 150 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో మృతి చెందిన వారికి తమిళనాడులోని పలువురు నేతలు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి అగ్ని ప్రమాదంపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.

టపాకాయల గోడౌన్లలో తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినప్పటికీ గోడౌన్ల యాజమాన్యాలు సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కార్మికులు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

Suhani Bhatnagar : 19 ఏళ్లకే మరణించిన సుహానీ భట్నాగర్ ఎవరు? దంగల్ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమైంది?

 

 

ట్రెండింగ్ వార్తలు