Delta Plus Cases : వ్యాక్సిన్‌ వేసుకున్నా వదలని డెల్టా ప్లస్‌

మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది.

Delta Plus Cases : మహారాష్ట్రలో కరోనా డెల్టా ప్లస్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. అక్కడ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. వ్యాక్సిన్‌ వేసుకున్నా ఈ వేరియంట్‌ వదలడంలేదు. ఒక్కరోజులోనే మహారాష్ట్రలో కొత్తగా మరో 10 డెల్టా ప్లస్‌ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం డెల్టా ప్లస్‌ వేరియంట్ కేసుల సంఖ్య 76కి పెరిగింది. ఈ వేరియంట్‌ బారినపడ్డ వారిలో పది మంది వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోగా.. 12మందికి తొలి డోసు పూర్తయిందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, డెల్టా ప్లస్‌ సోకడంతో రాష్ట్రంలో ఐదుగురు మరణించగా.. వారిలో ఇద్దరు వ్యాక్సిన్‌ పూర్తయినవారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నప్పటికీ డెల్టా ప్లస్‌ మాత్రం సెగలు రేపుతోంది. ఇక నమోదవుతున్న కేసుల్లో పుణె, సతారా, కొల్హాపూర్‌, సోలాపూర్‌, సంగ్లి, అహ్మద్‌నగర్‌, రత్నగిరి జిల్లాలనుంచే ఎక్కువగా రికార్డవతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 4 వేల 800 కొత్త కొవిడ్‌ కేసులు నమోదవగా.. 130 మరణాలు సంభవించాయి.
Mumbai : షాకింగ్ న్యూస్, డెల్టా ప్లస్‌‌తో వృద్ధురాలి మృతి

కరోనా వైరస్‌ ఇంకా పోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రజల్ని హెచ్చరించారు. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగితే లాక్‌డౌన్‌ తప్పదని కూడా వార్నింగ్‌ ఇచ్చారు. ఇతర దేశాల్లో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌లు పుట్టుకోస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు