Kinnaur Landslide : కొండచరియలు విరిగిపడిన ఘటనలో 11 మంది మృతి..వీడియో

హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్‌ జిల్లా నుగుల్‌సారి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు.

Kinnaur Landslide హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్‌ జిల్లా నుగుల్‌సారి ప్రాంతంలో ఇవాళ మధ్యాహ్నాం కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. కొండ చరియ శిథిలాల కింద చిక్కుకున్న దాదాపు 30 మంది ఆచూకీ ఇంకా అభించలేదని తెలిపారు. ఇప్పటి వరకు 14 మందిని కాపాడి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించినట్లు తెలిపారు.

అసలేం జరిగింది

బుధవారం మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో కిన్నౌర్‌ జిల్లోని రెఖాంగ్‌ పీయో – సిమ్లా జాతీయ రహదారిపై నుగుల్‌సారి ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా భారీ కొండచరియలు విరిగిపడడంతో ఆ రహదారిపై వెళ్తున్న వాహనాలన్నీ బండరాళ్ల కింద చిక్కుకుపోయాయి. కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. బస్సులోనే సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు కిన్నౌర్‌ డిప్యూటి కమిషనర్‌ హుస్సేన్‌ సిద్ధిఖ్‌ చెప్పారు.

కాగా,దాదాపు 200 మంది ఐటీబీపీ(Indo-Tibetan Border Police)సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగుతున్నట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తెలిపారు. రెస్కూ ఆపరేషన్ లో పాల్గొనాలని స్థానిక పోలీసులు,యంత్రాంగాన్ని కూడా ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు