Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం…12 మంది మృతి, 23మందికి గాయాలు

మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఆదివారం బస్సు కంటైనర్‌ను ఢీకొట్టడంతో 12 మంది మరణించారు....

Road Accident

Maharashtra : మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఆదివారం బస్సు కంటైనర్‌ను ఢీకొట్టడంతో 12 మంది మరణించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం తెల్లవారుజామున మినీ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టడంతో 12 మంది మరణించారు. ఈ రోడ్డు ప్రమాదంలో 23 మంది గాయపడ్డారు.

Also Read :Boat Capsizes : కాంగోలో పడవ బోల్తా..27మంది మృతి

ప్రమాదం జరిగిన సమయంలో ప్రైవేట్ బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ముంబయికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలోని వైజాపూర్ ప్రాంతంలో తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయారు.

Also Read :Asaduddin Owaisi : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

దీంతో బస్సు వెనుక వైపు నుంచి కంటైనర్‌ను ఢీకొట్టిందని పోలీసు అధికారులు తెలిపారు. 12 మంది మృతుల్లో ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఒక మైనర్ బాలిక ఉన్నారు. మరో 23 మందికి గాయాలయ్యాయని, వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించామని అధికారులు వివరించారు.

Also Read :Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 197 మంది భారతీయులతో ఢిల్లీ వచ్చిన మూడో విమానం