Italy Flight : ఇటలీ నుంచి పంజాబ్ కు మరో విమానం..ఈసారి 150మందికి కరోనా

ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న విమానాలు కోవిడ్ వైరస్ ని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. గురువారం ఇటలీలోని మిలాన్‌ నుంచి అమృత్‌సర్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది

Italy Flight :  ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న విమానాలు కోవిడ్ వైరస్ ని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. గురువారం ఇటలీలోని మిలాన్‌ నుంచి అమృత్‌సర్‌ వచ్చిన ఓ ఛార్టర్డ్‌ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఒక్కరోజైనా గడువకముందే, ఇవాళ కూడా ఇటలీ నుంచి అమృత్ సర్ వచ్చిన మరో విమానంలోనూ కరోనా కలకలం రేగింది.

శుక్రవారం ఇటలీలోని రోమ్ నుంచి నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన విమానంలోని 150 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఆ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉండగా, విమానాశ్రయంలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. బాధిత ప్రయాణికులందరినీ ఐసోలేషన్‌కు తరలించారు.

కాగా ఒమిక్రాన్‌ ‘ముప్పు ఉన్న’ దేశాల జాబితాలో ఇటలీ కూడా భారత్ చేర్చిన నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టులో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే.

ALSO READ Omicron : కేంద్రం కీలక నిర్ణయం.. విదేశాల నుంచి వస్తే 7 రోజులు తప్పనిసరి హోం క్వారంటైన్

ALSO READ Italy Corona Flight: ఇటలీ నుంచి వచ్చిన 125 మంది కరోనా ప్యాసింజర్లలో 13 మంది పరార్

ట్రెండింగ్ వార్తలు