Omicron : కేంద్రం కీలక నిర్ణయం.. విదేశాల నుంచి వస్తే 7 రోజులు తప్పనిసరి హోం క్వారంటైన్

కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదలకు ఒమిక్రానే కారణమని భావిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే

Omicron : కేంద్రం కీలక నిర్ణయం.. విదేశాల నుంచి వస్తే 7 రోజులు తప్పనిసరి హోం క్వారంటైన్

International Passengers

International Arrivals : కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదలకు ఒమిక్రానే కారణమని భావిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులందరికీ ఏడు రోజుల హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ట్రావెల్ నిబంధనలను సడలించింది. ఎట్ రిస్క్(ప్రమాద ముప్పు పొంచి ఉన్న) జాబితాలో ఉంచబడిన-యూకే సహా అన్ని యూరప్ దేశాలు,దక్షిణాఫ్రికా,బ్రెజిల్,బొత్స్వానా,చైనా,ఘనా,మారిషస్,స్యూజిలాండ్,జింబాబ్వే,టాంజానియా,హాంకాంగ్,ఇజ్రాయెల్,కాంగో,ఇథియోపియా,కజకిస్తాన్,కెన్యా,నైజీరియా,ట్యునిషియా,జాంబియా దేశాల నుంచి భారత్ కు వచ్చేవాళ్లు ఎయిర్ పోర్ట్ లో దిగిన తర్వాత కోవిడ్ పరీక్ష కోసం శాంపిల్స్ ను ఇవాళ్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం..వీరి టెస్ట్ ఫలితాలు వచ్చిన తర్వాతనే ఎయిర్ పోర్ట్ దాటి వెళ్లేందుకు అనుమతిస్తారు. నెగిటివ్ వస్తే..ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి,ఎనిమిదవ రోజున ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఫలితాలను ఎయిర్ సువిధ పోర్టల్ లో ప్రయాణికులు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. నెగిటివ్ గా ఫలితం వస్తే..వారు తదుపరి 7 రోజుల పాటు వారి ఆరోగ్యాన్ని స్వీయ-పర్యవేక్షిస్తారు. అయితే, పాజిటివ్‌గా ఫలితం వస్తే.. కొత్త మార్గదర్శకాల ప్రకారం, వారి నమూనాలను INSACOG ప్రయోగశాల నెట్‌వర్క్‌లో జన్యు పరీక్ష కోసం పంపాలి.

ALSO READ Home Isolation : హోం ఐసొలేషన్ కి కేంద్రం కొత్త గైడ్ లైన్స్