షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 16మంది మృతి

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 08:01 AM IST
షాజహాన్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం : 16మంది మృతి

Updated On : August 27, 2019 / 8:01 AM IST

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. షాజహాన్ పూర్ లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఓ  ట్రక్కు రెండు టెంపోలను ఢీకొంది. ఈ ప్రమాదంలో 16మంది అక్కడిక్కడే మృతి చెందారు.పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మృతి చెందిన వారిలో మహిళలతో సహా ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

గాయపడినవారికి మెరుగైన చికిత్సనందించాలని సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గాయపడివారు వెంటనే వారు కోలుకోవాలని ప్రార్థించారు.