Heart Attack(Photo : Google)
Heart Attack Death : గుండెపోటు.. ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేదు అందరినీ కాటేస్తోంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారే కాదు ఎలాంటి జబ్బులు లేని వారు ఎంతో హెల్తీగా ఫిట్ గా ఉన్న వారు కూడా గుండెపోటుతో సడెన్ గా చనిపోతున్నారు. అప్పటివరకు ఎంతో చలాకీగా ఉన్న వారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ తో కన్నుమూస్తున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. యువత, పిల్లలు సైతం హార్ట్ ఎటాక్ తో మృతి చెందుతున్నారు.
తాజాగా మరో విద్యార్థి గుండె ఆగింది. 17ఏళ్లకే అతడికి నూరేళ్లు నిండాయి. మధ్యప్రదేశ్ లోని చత్తర్ పూర్ నగరంలో టెన్త్ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. సార్థక్ టకారియా అనే కుర్రాడు మహర్షి విద్యా మందిర్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అతడి వయసు 17ఏళ్లు. అతడి తండ్రి అలోక్ టికారియా బిజినెస్ మ్యాన్. ఆయన చిన్న కొడుకే సార్థక్. రోజూలాగే ఎంతో ఉత్సాహంగా సోమవారం కూడా స్కూల్ కి వెళ్లాడు. స్కూల్ లో ప్రేయర్ జరుగుతోంది. ఇంతలో అకస్మాత్తుగా సార్ధక్ కుప్పకూలాడు.
Also Read..Risk of Diabetes : మధుమేహ ప్రమాదాన్ని పెంచే 6 విషపూరిత అలవాట్లు !
వెంటనే టీచర్లు సార్ధక్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, గుండెపోటుతో అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో టీచర్లు, తోటి విద్యార్థులు అంతా షాక్ తిన్నారు. టెన్త్ విద్యార్థి గుండెపోటుతో చనిపోవడాన్ని నమ్మలేకపోతున్నారు. సార్ధక్ మృతితో అతడి ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది. సార్ధక్ ఇకలేడనే వార్తను వారు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.