17yearold Boy Bihar 82 Teeth In The Mouth
17yearold boy 82 teeth in the mouth : మనుషులకు 32 పళ్లు (దంతాలు) ఎన్ని ఉంటాయి అంటే ఠక్కున 32 అని చెప్పేస్తాం. దంత సమస్యలు ఏమైనా ఉంటే కొందరికి అవి ఊడిపోవచ్చు. కానీ 32కు మించి దంతాలు ఉండటం అంటే అది కచ్చితంగా వింతే. కానీ ఓ యువకుడు మాత్రం దంతాల విషయంలో వింతలక వింతగా మారాడు. ఎందుకంటే ఆ కుర్రాడకి ఏకంగా 32 కాదు దానికి డబుల్ 64 కూడా కాదు ఏకంగా ‘82 పళ్లు’ ఉన్నాయి. అతడిని చూసిన డాక్టర్లు కూడా షాక్ అయ్యారు. ఆ కుర్రాడి వయస్సు అతనికి ఉన్న దంతాల కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఈ 82 పళ్ల యువకుడి వయస్సు 17 ఏళ్లు.
బిహార్లోని పాట్నాకు చెందిన 17 ఏళ్ల నితీష్ కుమార్ దవడ నొప్పి విపరీతంగా ఉండటంతో దంతాల డాక్టర్ వద్దకు వెళ్లాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు షాక్ అయ్యారు.ఎందుకంటే నితీష్ కుమార్ దవడలో 82 పళ్లు ఉన్నాయి. అందువల్లే దవడ నొప్పిగా ఉందని తెలిపారు. దీనిపై డాక్టర్లు మాట్లాడుతూ..దవడలో ఏర్పడే ట్యూమర్ వల్ల దంతాలన్నీ ఒకే దగ్గర ఎక్కువ మొత్తాల్లో పుట్టుకొస్తాయని తెలిపారు. ఇటువంటి దాన్ని వైద్య పరిభాషలో `ఒడొంటొమా` అంటారని తెలిపారు. దీంతో నితీష్ కు మూడు గంటలపాటు సుదీర్ఘ ఆపరేషన్ చేసి దవడంలోని ట్యూమర్ని తొలగించారు. ప్రస్తుతం నితీష్ కుమార్ ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు తెలిపారు.