New AC Coaches : కొత్త AC-2 టైర్ LHB కోచ్ స్పీడ్ ట్రయల్ సక్సెస్.. గంటకు 180 కిలోమీటర్ల వేగం!

భారత రైల్వే.. కొత్త AC-2 టైర్ LHB కోచ్ స్పీడ్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. కొత్త కోచ్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. Nagda-Kota-Sawai Madhopur విభాగంలో ఈ ట్రయల్ జరిగింది.

New AC Coaches Trial : భారత రైల్వే.. కొత్త AC-2 టైర్ LHB కోచ్ స్పీడ్ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. కొత్త కోచ్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. Nagda-Kota-Sawai Madhopur విభాగంలో ఈ ట్రయల్ జరిగింది. దీనికి సంబంధించి వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. అందులో స్పీడోమీటర్ స్పష్టంగా 180 kmph మార్క్ మెరుపు వేగంతో చేరడాన్ని చూడొచ్చు. వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) సీనియర్ రైల్వే అధికారి ప్రకారం.. యూరోపెన్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసేందుకు ఏసీ కోచ్‌ ట్రయల్స్ నిర్వహించినట్టు తెలిపింది.

Nagda- Kota-Sawai Madhopur విభాగం (WCR)లో వివిధ కోచ్‌లు, లోకోమోటివ్‌లు 60కి పైగా స్పీడ్ ట్రయల్స్ నిర్వహించింది భారత రైల్వే. ఈ ట్రయల్ మొత్తం పొడవు 350 కిలోమీటర్లు. ఇప్పటి వరకు ఈ విభాగంలో 8900 కిలోమీటర్ల వరకు ట్రయల్స్ నిర్వహించింది. అంతకుముందు, ఈ ఏడాదిలో రైల్వేలు నాగ్డా-కోటా-సవాయి మాధోపూర్ విభాగంలో 180 కిలోమీటర్ల వేగంతో ఎయిర్ కండిషన్డ్ త్రీ-టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ ట్రయల్స్ నిర్వహించినట్లు RCF జనరల్ మేనేజర్ రవీందర్ గుప్తా తెలిపారు. RCF మొదటి ప్రోటోటైప్ ఎకానమీ క్లాస్ ఎయిర్ కండిషన్డ్ త్రీ టైర్ కోచ్‌ను ఫిబ్రవరి 10 న రిలీజ్ చేశారు.


ఆ కోచ్ ట్రయల్స్ కోసం రీసెర్చ్ డెవలప్‌మెంట్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO)కు అప్పగించింది. మూడు వారాల ట్రయల్స్ నిర్వహించిన అనంతరం ట్రయల్ విజయవంతమైందని RDSO గుప్తా చెప్పారు. కొత్త హై-కెపాసిటీ ప్యాసింజర్ కోచ్‌ను RCF కపుర్తాలా డిజైన్ చేసింది. ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో ఈ కొత్త ప్యాసింజర్ కోచ్‌లో అమర్చారు.

ప్రస్తుతం ఉన్న 3 టైర్ సామర్థ్యం 72 బెర్త్‌లతో పోల్చితే.. ప్రయాణీకుల సామర్థ్యాన్ని 83 బెర్త్‌లకు పెంచారు. ప్రతి బెర్త్‌కు సింగిల్ ఏసీ వెంట్లను అమర్చారు. ప్రతి కోచ్‌కు ఒక వికలాంగుల కోసం టాయిలెట్ ఎంట్రీ డోర్ ఉంటుంది. ఈ బోగీల్లో ప్రయాణీకుల సౌకర్యాలలో భాగంగా పబ్లిక్ అడ్రస్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసింది. రాత్రి సమయాల్లో కూడా సులభంగా గుర్తించేలా బెర్తులపై లైటింగ్ సైన్స్ కూడా ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు