Lockup Death : 20 ఏళ్లలో 1,888 మంది లాకప్‌డెత్

గడిచిన 20ఏళ్లలో దేశ వ్యాప్తంగా 1,888 లాకప్‌డెత్‌లు చోటుచేసుకున్నాయి. ఇక ఆయా కేసుల్లో 26 మంది పోలీసులపై నేర రుజువైనట్లు తేలింది.

Lockup Death : గడిచిన 20ఏళ్లలో దేశ వ్యాప్తంగా 1,888 లాకప్‌డెత్‌లు చోటుచేసుకున్నాయి. ఇక ఆయా కేసుల్లో 26 మంది పోలీసులపై నేర రుజువైనట్లు తేలింది. అయితే అధికారిక లెక్కల ప్రకారం గత 20 ఏళ్లలో లాకప్ డెత్ కేసుల్లో 893 మంది పోలీసులపై కేసులు నమోదు కాగా.. 358 మందిపై చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఇక 20ఏళ్లలో కస్టడీలో చనిపోయిన 1,888 మందిలో 1,185 మందిని రిమాండ్‌లో ఉంచలేదు అని చూపించారు.

చదవండి : Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్

కస్టడీలో ఉన్న 703 మరణాలను మాత్రమే రిమాండ్‌ సమయంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా చూపించారు. లాకప్ డెత్ లో మరణించిన వారిలో 60 శాతం మందిని అసలు కోర్టు మెట్లు కూడా ఎక్కించలేదని అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది.

చదవండి : Lockup Death Case : అడ్డగుడూరు లాకప్‌డెత్‌ : ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా 76 మంది పోలీస్‌ కస్టడీలో మరణించారు. ఇక గత నాలుగేళ్లలో కస్టడీ మరణాలకు సంబంధించి 96 మంది పోలీసులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తోపాటు తెలంగాణలో కూడా లాకప్ డెత్ కేసులు కలకలం సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు