Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్

అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

Mariamma Lockup Death : గుండె ఆగిపోయేలా కొడతారా?..మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు సీరియస్

Mariamma

Updated On : November 10, 2021 / 5:58 PM IST

Telangana High Court serious : అడ్డగూడూరులో మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ మృతిపై మెజిస్ట్రేట్ హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించింది. మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీకి ఆదేశించింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు ఏజీ ప్రసాద్ తెలిపింది. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Mine Accident : మంచిర్యాల గని ప్రమాదంలో ఒకరి మృతదేహం వెలికితీత

ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని హైకోర్టు తెలిపింది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని హైకోర్టు భావించింది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.