Maharashtra Ganesh idols immersion: నిమజ్జనంలో అపశృతులు.. పలు ప్రాంతాల్లో 19 మంది మృతి

మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో అపశృతులు చోటుచేసుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది నీళ్లలో మునిగి మృతి చెందారు. వార్ధా జిల్లాలోని సావంగి గ్రామంలో ముగ్గురు చెరువుల్లో మునిగి మృతి చెందారని, దేవ్లీ ప్రాంతంలో మరొకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు. మిగతా పలు ప్రాంతాల్లోనూ అపశృతులు చోటుచేసుకున్నాయి.

Alabama shooting

Maharashtra Ganesh idols immersion: మహారాష్ట్రలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు ప్రాంతాల్లో అపశృతులు చోటుచేసుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 14 మంది నీళ్లలో మునిగి మృతి చెందారు. వార్ధా జిల్లాలోని సావంగి గ్రామంలో ముగ్గురు చెరువుల్లో మునిగి మృతి చెందారని, దేవ్లీ ప్రాంతంలో మరొకరు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెప్పారు.

యావత్మాల్ జిల్లాలోని ఓ చెరువులు ఇద్దరు మునిగి మృతి చెందినట్లు వివరించారు. అహ్మద్ నగర్ జిల్లాలో ఇద్దరు చెరువుల్లో మునిగి మృతి చెందారని, మరో ఇద్దరు జలగావ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. నాగ్ పూర్ లో నలుగురు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు.

కొల్బాద్ ప్రాంతంలోని గణేశ్ మండం కూలి ఒక మహిళ మృతి చెందిందని, మరో నలుగురికి గాయాలయ్యాయని చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ అపశృతులు చోటుచేసుకున్నామని వివరించారు. కొందరికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోందని, పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వివరించారు.

EetelaRajender slams KCR: ఇలాంటి వ్యక్తి ఇప్పుడు దేశానికి నాయకత్వం వహిస్తానంటున్నారు: ఈటల