Amit Shah
ఛత్తీస్‌గఢ్‌లో జనవరి నుంచి ఇప్పటివరకు 194 మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చారని, 801 మందిని అరెస్టు చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అలాగే, 742 మంది నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారని చెప్పారు.
ఇవాళ మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. నక్సలిజంపై పోరాటంలో విజయం సాధించినందుకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. అంతేగాక, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లో దాదాపు 13,000 మంది ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు.
ఎస్‌ఆర్‌ఈ పథకం కింద ఇచ్చే నిధులు రూ.1,180 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ.3,006 కోట్లకు చేరిందని అమిత్ షా అన్నారు. అంతేగాక, ప్రత్యేక కేంద్ర సహాయ పథకం కింద కూడా పదేళ్లలో రూ.3,590 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2019కి ముందు సైనికుల కోసం రెండు హెలికాప్టర్లు ఉండేవని, కానీ ఇప్పుడు వాటి సంఖ్య 12కి పెరిగిందని తెలిపారు. నక్సిలిజం నిర్మూలన కోసం తాను జనవరిలో ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినప్పుడు ఓ ప్రణాళిక రూపొందించామని అన్నారు.
పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్.. కారణం ఏంటంటే..