×
Ad

Video: సినీనటుడు, టీవీకే అధినేత విజయ్ సభలో తొక్కిసలాట.. చిన్నారులు సహా 31 మంది మృతి.. మరికొందరి పరిస్థితి విషమం

తొక్కిసలాట జరగడంతో విజయ్ కరూరులో తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ఆపేశారు.

Stampede At TVK Chief Vijay

Karur stampede: తమిళనాడులోని కరూరులో తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత, సినీనటుడు విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని స్థానిక ఆసుపత్రి అధికారులు అంటున్నారు. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 46 మందికి గాయాలు అయ్యాయని అధికారులు చెప్పారు.

సభాస్థలికి విజయ్ వస్తుండడంతో చాలా మంది గంటల తరబడి వేచి ఉన్నారు. విజయ్ సభాస్థలికి ఆలస్యంగా చేరుకున్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తొక్కిసలాట చేరుకున్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరగడంతో విజయ్ కరూరులో తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ఆపేశారు.

బాధితులను అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ కరూరుకు వెళ్లారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరూరు జిల్లా కార్యదర్శి వి సెంటిల్ బాలాజీకి ఫోన్ చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.

“కరూరులో జరిగిన ఘటనకు సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తొక్కిసలాటలో సొమ్మసిల్లిపడిపోయిన వారికి తక్షణమే వైద్య చికిత్స అందించాలని నేను ఆదేశించాను” అని స్టాలిన్ తమిళంలో ఎక్స్‌లో పోస్టు చేశారు.