2000 Rupees Note : లాస్ట్ డే..! రూ.2వేల నోట్లు మార్చుకోవడానికి ముగియనున్న గడువు.. మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..

ఆర్బీఐ విధించిన గడువు నేటితో ముగియనుంది. అయితే, మరోసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. అదే జరిగితే.. మీరు బ్యాంకులకు వెళ్లి మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను డిపాజిట్ చేయలేరు. కానీ,

2000 Rupees Note : లాస్ట్ డే..! రూ.2వేల నోట్లు మార్చుకోవడానికి ముగియనున్న గడువు.. మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి..

Rs 200 Nots

Updated On : October 7, 2023 / 12:05 PM IST

RBI 2000 Rupees Note: మీ వద్ద రూ. 2వేల నోట్లు ఉన్నాయా? అయితే, వెంటనే మీ దగ్గరిలోని బ్యాంకుల వద్దకు వెళ్లి వాటిని మార్చేసుకోండి. రూ.2వేల నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన గడువు నేటితో ముగియనుంది. ఆర్బీఐ ప్రకారం.. శనివారం సాయంత్రం వరకు మార్చుకోకపోతే రేపటి నుంచి మీ దగ్గర ఉన్న 2వేల నోట్లు నిరుపయోగం అయినట్లే. ఆర్బీఐ రూ. 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ఈ ఏడాది మే 19న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రజల వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ గడువు నాటికి పూర్తిస్థాయి నోట్లు బ్యాంకులకు చేరకపోవడంతో గడువును అక్టోబర్ 7వ తేదీ వరకు పెంచింది. దీంతో ఈరోజుతో రూ. 2నోట్ల డిపాజిట్ కు గడువు ముగియనుంది.

Read Also : Rs 2000 Notes: 2వేల నోట్లు మీదగ్గర ఇంకా ఉన్నాయా? ఆర్‌బీఐ మరో కీలక ప్రకటన చేసింది

2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి. 2018 మార్చి 31న అత్యధికంగా 6.73 లక్షల కోట్ల విలువైన 2వేల నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే, 2023 మార్చి 31 వరకు రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు మార్కెట్ చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. కాగా, సెప్టెంబర్ 29 నాటికి ఆ నోట్లలో 96శాతం బ్యాంకులు, ఆర్బీఐ 19 కార్యాలయాల ద్వారా తిరిగి వచ్చాయి. వాటి విలువ రూ. 3.43లక్షల కోట్లు. సెప్టెంబర్ 30 తరువాత రూ. 0.14 లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు బ్యాంకులకు చేరాల్సి ఉంది. దీంతో ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఈ గడువు నేటితో ముగియనుంది.

Read Also : RBI on 2K Currency Note: రూ.2000 నోట్లు ఇంకా మార్చుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్

ఆర్బీఐ విధించిన గడువు నేటితో ముగియనుంది. అయితే, మరోసారి గడువు పెంచే అవకాశం లేదని తెలుస్తోంది. అదే జరిగితే.. మీరు బ్యాంకులకు వెళ్లి మీ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను డిపాజిట్ చేయలేరు. కానీ, అక్టోబర్ 7 తరువాత కూడా ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల నుంచి రూ.2వేల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే, రూ. 20వేల కంటే ఎక్కువ నగదు ఉంటే ఒకేసారి మార్చుకోలేము.