26/11 Mumbai Terrorist Attacks: ముంబై మరణహోమానికి 13 ఏళ్లు..

2008, నవంబర్ 26. ముంబైలో టెర్రిరిస్టులు మారణహోమం సృష్టించిన రోజు. ఈ దారుణం జరిగి 13 ఏళ్లు అయ్యింది. కానీ ఈ దుశ్చర్యతాలూకూ భయం ఇంకా భారత్ ను వెన్నాడుతునే ఉంది.

26/11 Mumbai  Terrorist Attacks: అది 2008, నవంబర్ 26. ముంబైలో టెర్రిరిస్టులు మారణహోమం సృష్టించిన రోజు. ఈ దారుణం జరిగి 13 ఏళ్లు అయ్యింది. కానీ ఈ దుశ్చర్యతాలూకూ భయం ఇంకా భారత్ ను వెన్నాడుతునే ఉంది. ముంబైలో ఉగ్రదాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురించేసింది. ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది ముంబై ఘటన. ఆ దారుణ ఘటనలో బాధితులైనవారి ఈనాటికి గుండెలు దడదడలాడుతుండగా ఉలిక్కిపడుతునే ఉన్నాయి. ఈనాటికి అదో చేదు జ్ఞాపకంగా..చీకటిరోజుగా మిగిలిపోయింది. ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికే ఈ ఘటనను మర్చిపోలేకపోతున్నారు. గుండెల్లో బాధ పొంగుకొస్తుంటే పంటిబిగివుల అదిమిపెట్టి కాలం వెళ్లబుచ్చుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన తమ ఆత్మీయుల్ని తలచుకుని కుమిలిపోతునే ఉన్నారు.

Read more :Pregnant Girlfriend: ప్రెగ్నెంట్ గర్ల్‌ఫ్రెండ్‌ను ట్రైన్‌లో నుంచి తోసిన వ్యక్తికి 10ఏళ్ల జైలు శిక్ష

2008 నవంబర్‌ 26న జరిగిన మారణహోమాన్ని.. ముంబై మహానగరం ఈనాటికే కాదు ఎన్ని దశాబ్ధాలు గడిచినా మరిచిపోలేదు. పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రమూకలు సృష్టించిన నరమేథానికి 13 ఏళ్లు పూర్తయినా ఆనాటి గాయాలు ఈనాటికి మానలేదు. ఎప్పటికీ ఆ గాయాలు పచ్చిగానే ఉంటాయి. గుండెల్ని కెలుకుతునే ఉంటాయి. ఈక్రమంలో ముంబై నగరలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై పోలీస్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేశారు. ట్రైనింగ్‌, ఆయుధాల వాడకం, ఎటువంటి సమయంలోనైనా దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం వంటి విషయాల్లో ఎంతో పురోగతి సాధించారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్స్, ఆయుధాల్ని పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బందిని గణనీయంగా పెంచుకున్నారు. ఎవరైనా ఇటువైపు కన్నెత్తి చూస్తే ఖతంచేసిన పారేస్తామంటున్నారు.

Read more :Aryan Khan : ఇంకా తేరుకొని ఆర్యన్ ఖాన్… కౌన్సిలింగ్ ఇప్పించనున్న హృతిక్

13 ఏళ్ల కిందట జరిగిన ఉగ్ర అరాచకం.. ప్రపంచ ఉగ్ర దాడుల్లోనే అత్యంత ఘోరమైన చర్యగా నిలిచిపోయింది. పాకిస్థాన్‌లోని కరాచీ రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా ముంబైలోకి చొరబడ్డారు లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. అజ్మల్ కసబ్ సహా 10 మంది ముష్కరులు..తాజ్‌, ఒబెరాయ్ హోటల్, చత్రపతి శివాజీ టెర్మినల్‌ దగ్గర నాలుగు రోజుల పాటు మారణకాండ సృష్టించారు. ఈ మారణహోమంలో ఎంతోమంది అసువులు బాసారు. మొత్తం 166 మంది చనిపోగా, 300 మందికి పైగా గాయపడ్డారు. మరణ ఘటనల నుంచే కాదు..ఆనాడు అయిన గాయాల నుంచి కోలుకోనేలేదు. ఇలాంటి ఉగ్రదాడి మళ్లీ జరిగే పరిస్థితే రానివ్వబోమంటున్న ముంబై పోలీసులు అనుక్షణం అప్రమత్తంగానే ఉంటున్నారు. ఆ చేదు జ్ఞాపకానికి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నాటి దాడుల్లో వీర మరణం పొందిన పోలీసులు..భద్రతా సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు.

 

ట్రెండింగ్ వార్తలు