25 మంది ఎంపీలకు కరోనా పాజిటీవ్, వాట్ నెక్ట్స్

Parliament Monsoon Session: 17 మంది లోక్ సభ, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలకు కోవిడ్ పాజిటీవ్‌గా తేలింది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వాలంటే కోవిడ్ టెస్ట్‌లు కంపల్సరీ.
అందులో భాగంగా ఎంపీలందికీ నిర్వహించిన టెస్ట్‌ల్లో 25 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. కరోనా వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది బీజేపీ వాళ్లే….12 మంది.
YSR Congress ఎంపీలు ఇద్దరు, Shiv Sena, DMK, RLP ఒక్కొక్కరు చొప్పున పాజిటీవ్‌గా తేలారు.
పార్లమెంట్ వర్గాల ప్రకారం మొత్తంమీద 56 మందికి కరోనా వచ్చింది. ఇందులో పార్లమెంట్ అధికారాలు, మీడియా, ఎంపీలూ ఉన్నారు.
మొత్తం 785 మంది ఎంపీల్లో 200 మంది 65 ఏళ్లు దాటినవాళ్లే. వీళ్లకు ఎక్కువగా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ వయస్సు వారిలోనే మరణాలు రేటు కూడా ఎక్కువ.
అంతకుముందు ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వాళ్లో అమిత్ షాకూడా ఉన్నారు. పార్లెమెంట్ సమావేశాలకు ముందు నిమ్స్‌కి టోటల్ చెకప్ కెళ్ళారు.