Assam Earthquake : అసోంలో మళ్లీ భూకంపం.. వణికిస్తోన్న వరుస ప్రకంపనలు

అసోంలోని తేజ్ పూర్ వద్ద భూకంపం సంభవించింది. ఉదయం 10.30 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

Assam Earthquake : అసోంలో మళ్లీ భూకంపం.. వణికిస్తోన్న వరుస ప్రకంపనలు

3.6 Magnitude Earthquake Hit Assam's Tezpur

Updated On : May 6, 2021 / 12:20 PM IST

3.6 magnitude earthquake Assam : అసోంలోని తేజ్ పూర్ వద్ద భూకంపం సంభవించింది. ఉదయం 10.30 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. అంతకుముందు ఏప్రిల్ 29న, రిక్టర్ స్కేల్‌లో 3.6 తీవ్రతతో భూకంపం అస్సాంలోని సోనిత్‌పూర్‌లో సంభవించింది.

ఏప్రిల్ 28న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అసోంలో వరుసగా ఇది ఏడో భూప్రకంపన.. ఏప్రిల్ 28న, రోజంతా సోనిత్‌పూర్‌లో సుమారు 10 భూకంపాలు సంభవించాయి.