బెంగాల్ బోర్డర్ లో పేలిన బాంబ్ : ముగ్గురు మృతి 

  • Publish Date - October 29, 2019 / 05:26 AM IST

పశ్చిమబెంగాల్ లో సాకెట్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫర్జీపర సరిహద్దు అవుట్ పోస్టు వద్ద సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం 6.20 గంటలకు జరిగింది.   పశువులను అక్రమంగా తరలించే గ్యాంగ్ ఈ బాంబును అమర్చినట్లుగా సరిహద్దు భద్రతాదళాలు వెల్లడించాయి. 

ఫర్జీపారా సరిహద్దుల్లోని అవుట్ పోస్టు వద్ద సాకెట్ బాంబు అమర్చిన సాకెట్ బాంబును అమర్చారనీ..ఆ బాండు పేలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామన్నారు. ఈ పేలుడుతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ జవాన్లు పరిసర ప్రాంతాలు క్షుణ్ణంగా గాలిస్తున్నారు. ఈ పేలుడుకు పాల్పడిన వారిని పట్టుకుంటామని అధికారులు చెప్పారు.