Petrol Close
WB Petrol Pumps : ఒకటి కాదు..రెండు కాదు..మూడు వేల పెట్రోల్ బంక్ లు మూతపడడంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పెట్రోల్ లేకపోవడంతో బస్సులు, ఇతరత్రా వాటిపై వెళుతున్నారు. దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ…పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునివ్వడంతో పెట్రోల్ బంక్ లు మూతపడ్డాయి. మొత్తం 24 గంటల పాటు ఈ బంద్ కొనసాగనుంది. వాహనాలు రోడ్డు మీదకు రాకపోవడంతో కొన్ని ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోయాయి.
Read More : KTR : పెట్రోల్ కు డబ్బులేక పాదయాత్ర చేస్తున్నారా-కేటీఆర్
తమ దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మంగళవారం సమ్మెకు పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచే సమ్మె ప్రారంభమైంది. దాదాపు 3 వేలకు పైగా పెట్రోల్ బంక్ లకు తాళాలు పడ్డాయి. ఈ సందర్భంగా పెట్రోల్ పంపుల యజమానుల సంఘం జాయింట్ సెక్రటరీ ప్రసేంజిత్ మాట్లాడుతూ…ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అనేది అత్యంత హైగ్రోస్కోపిక్ అని, ఇది పెట్రోల్ భూగర్భ ట్యాంకుల్లోకి వర్షపు నీరు వెళుతోందన్నారు.
Read More : Petrol Rate : గుడ్ న్యూస్.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దీనివల్ల వినియోగదారుల మధ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ పై వినియోగదారులకు అవగాహన కల్పించాలని, వర్షకాలంలో ఇథనాల్ – మిశ్రమ పెట్రోల్ సరఫరాను పరిమితం చేయాలని అసోసియేషన్ వెల్లడించింది. పెట్రోల్ పంపులకు ఇంధనం తక్కువగా సరఫరా చేయడమనేది చాలా కాలంగా ఉన్న సమస్య అని..దీనిని పరిష్కరించాలని పెట్రోల్ పంపుల యజమానులు కోరుతున్నారు. అంతేగాకుండా..ఇంధనం రవాణా చేసేటప్పుడు ..చమురు చోరీకి గురవుతోందని, దీనివల్ల తమకు నష్టం వాటిల్లుతోందన్నారు. వెంటనే దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.