KTR : పెట్రోల్ కు డబ్బులేక పాదయాత్ర చేస్తున్నారా-కేటీఆర్

సెప్టెంబర్ 20 తర్వాత టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీని నియమిస్తామన్నారు కేటీఆర్. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.

KTR : పెట్రోల్ కు డబ్బులేక పాదయాత్ర చేస్తున్నారా-కేటీఆర్

Ktr

హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెట్రోల్ కొనుక్కునేందుకు డబ్బులు లేక పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదలప్పుడు కేంద్రం రూపాయి కూడా ఇవ్వనందుకు పాదయాత్ర చేస్తున్నారా అన్నారు. రాష్ట్రంలో మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు యాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం వల్ల.. లక్షలాది దళిత, గిరిజన, బీసీ ఉద్యోగాలు పోతాయని.. వారికి ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీజేపీ హయాంలో దేశ జీడీపీ బంగ్లాదేశ్ కంటే తగ్గిందని చెప్పేందుకు యాత్ర చేస్తున్నారా అని కౌంటరిచ్చారు.

సీఎం కేసీఆర్ అని కూడా చూడకుండా.. కొందరు నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్రాన్ని పుట్టిచ్చిన వ్యక్తిపైనే విమర్శలు చేస్తున్న వారు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. కేసీఆర్ కాలిగోరుకు కూడా విమర్శకులు సరిపోరన్నారు. మహారాష్ట్రలో సీఎంను విమర్శించిన కేంద్రమంత్రినే జైల్లో పెట్టారని గుర్తుచేశారు. తెలంగాణలో ఏడేళ్లుగా తాము సహనం పాటిస్తున్నామని అన్నారు. మంత్రి మల్లారెడ్డి సవాల్ చేసినట్టుగా.. రేవంత్ రాజీనామా చేయడానికి సిద్ధమే అయితే.. అప్పుడు చూసుకుందాం అన్నారు కేటీఆర్.

సెప్టెంబర్ 20 తర్వాత టీఆర్ఎస్ కొత్త రాష్ట్ర కమిటీని నియమిస్తామన్నారు కేటీఆర్. ఇందులో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చెప్పారు.