Gaganyaan : నలుగురు భారతీయ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ

  • Publish Date - September 9, 2020 / 07:49 AM IST

Russia’s Gagarin Cosmonaut Training Center : అంతరిక్షంలో ప్రయాణించేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో శిక్షణ పొందుతున్నారు. రష్యా రాజధాని మాస్కోలోని ‘గగరీన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్(జీసీటీసీ)’లో ఫిబ్రవరి 10న ఈ నలుగురికి శిక్షణ మొదలైంది.




2022లో గగన్ యాన్ ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది. GSLV Mark – 3 రాకెట్​ వ్యోమగాములను అంతరక్షంలోకి మోసుకొని వెళ్లనుంది. ‘గగన్‌యాన్‌’ భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం, భారత వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఫ్రాన్స్‌, రష్యాలతో ఒప్పందం కుదిరింది.
https://10tv.in/5-countries-of-armed-forces-will-be-strong-by-2030-india-where-will-be-there/



ప్రస్తుతం వ్యోమగాములు మంచి ఆరోగ్యంతో ఉన్నారని, శిక్షణను కొనసాగించాలని వారు కోరుకుంటున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. రష్య భాష నేర్చుకోవడం, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన శిక్షణ పొందుతున్నారని తెలిపింది. ఈ వారంలో సైద్ధాంతిక తరగతులు ప్రారంభయ్యాయని, ఏడాదిపాటు వీరికి భౌతిక శిక్షణతో పాటు బయోమెడికల్ రంగంలోనూ శిక్షణ ఉంటుందని పేర్కొంది.




రష్యా అంతరిక్ష నౌక సోయుజ్‌లోని వ్యవస్థలను కూడా వ్యోమగాములు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారని వివరించింది. గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇస్రోనే నలుగురు ఎయిర్‌ఫోర్స్ పెలైట్లను ఎంపిక చేసింది. ఇప్పుడు వీరికే రష్యాలో శిక్షణ మొదలైంది. మరోవైపు గగన్‌యాన్ ప్రాజెక్ట్ 2022లో జరగనున్నట్లు ఇప్పటికే ఇస్రో ప్రకటించింది.