Covid wave : కరోనా సెకండ్ వేవ్, మరణాల రేటు 40 శాతం అధికం
కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉందని తాజ అధ్యయనం వెల్లడిస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ లో మరణాల రేటు 40 శాతం అధికంగా ఉన్నట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ చేసిన అధ్యయనం వెల్లడైంది. ప్రధానంగా యువతే కరోనా బారిన పడి మరిణించినట్లు ఆందోళన కలిగించే విషయమని వెల్లడించింది.

Covid Second Wave
Max Healthcare Study : కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉందని తాజ అధ్యయనం వెల్లడిస్తోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ లో మరణాల రేటు 40 శాతం అధికంగా ఉన్నట్లు మ్యాక్స్ హెల్త్ కేర్ చేసిన అధ్యయనం వెల్లడైంది. ప్రధానంగా యువతే కరోనా బారిన పడి మరిణించినట్లు ఆందోళన కలిగించే విషయమని వెల్లడించింది.
ఈ హెల్త్ కేర్ ఆధ్వర్యంలోని 13 ఆసుపత్రుల్లో ఫస్ట్, సెకండ్ వేవ్ కోవిడ్ బాధితులు, మరణాల లెక్కలను విశ్లేషించి..ఈ వివరాలు వెల్లడించింది. తొలి దశలో కరోనా విస్తరిస్తున్న క్రమంలో..లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో వైరస్ విస్తరించకుండా చెక్ పెట్టినట్లైంది. అనంతరం ఆంక్షలను సడలించారు. దీంతో మరోసారి కరోనా పంజా విసిరింది. మరోసారి రాష్ట్రాల వారీగా..లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే..సెకండ్ వేవ్ లో కరోనా కేసులు అధికంగా పెరిగాయని వెల్లడించింది. మృతుల సంఖ్య కూడా గణనీయంగా ఉందని, దీనికి తోడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా అధికంగా అవుతూ వచ్చాయి.
మ్యాక్స్ ఆసుపత్రుల్లో నమోదైన వివరాల ప్రకారం…మొదటి దశలో 7.2 శాతంగా నమోదైన మరణాల రేటు…రెండో దశల్లో 10.5 శాతానికి చేరింది. ఫస్ట్, సెకండ్ వేవ్ ల్లో పురుషుల్లో 7.2 శాతం, 10.4 శాతం ఉండగా..మహిళల్లో 9.8 శాతం, 6.8 శాతంగా నమోదైందని నివేదిక వెల్లడించింది. 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగిన కోవిడ్ బాధితుల్లో మరణాల రేటు 1.3 శాతం నుంచి 4.1 శాతానికి పెరిగింది.
రెండో దశల్లో వెంటిలేటర్, ఐసీయూలో చికిత్స తీసుకొనే వారి సంఖ్య అధికంగా ఉంది. వైరస్ అధికంగా ఉండడంతో ఆసుపత్రుల్లో బెడ్స్ లభించలేదు. దీంతో మృతుల సంఖ్య పెరిగిందని, ప్రతి ముగ్గురి కరోనా బాధితుల్లో ఒకరికి ఐసీయూ అవసరమైందని, ఆక్సిజన్ అవసరం కూడా 63.4 శాతం నుంచి 74.1 శాతానికి పెరిగిందని అధ్యయనం వెల్లడించింది.