మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నితిన్(40) అనే హెచ్‌సీఎల్ ఉద్యోగి వాష్‌రూమ్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో సీనియర్ అనలిస్టుగా పనిచేస్తున్న నితిన్ ఎడ్విన్ మైఖేల్ కంపెనీ వాష్‌రూమ్‌కి వెళ్లి, ఆ తర్వాత బయటకు రాలేదు.
అతడు కింద పడిపోవడాన్ని గుర్తించిన తోటి ఉద్యోగులు నాగ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి తరలించారు. అప్పటికే నితిన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన పోలీసులు యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకున్నారు.
ప్రాథమిక శవపరీక్ష నివేదిక ప్రకారం నితిన్ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు తేలింది. నితిన్‌కు భార్య, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి మృతి కేసులో తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. అతడి మృతిపై హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంతాపం తెలిపింది.
ఈ ఘటనను దురదృష్టకర ఘటనగా పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. నితిన్ ఘటనలో అతడికి క్యాంపస్ హెల్త్‌కేర్ క్లినిక్ నుంచి ఎమర్జెన్సీ సపోర్ట్ అందిందని చెప్పింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తమ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను కూడా అందిస్తోందని తెలిపింది.
US Airstrikes : సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. 37 మంది ఉగ్రవాదులు హతం!