US Airstrikes : సిరియాపై అమెరికా వైమానిక దాడులు.. 37 మంది ఉగ్రవాదులు హతం!
US Airstrikes : సిరియాలో అమెరికా బలగాలు వరుస వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. యూఎస్ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

US Airstrikes on Syria kill 37 militants affiliated with extremist groups
US Airstrikes : లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో సిరియాలో అమెరికా బలగాలు వరుస వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. యూఎస్ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
ఈ మేరకు యూఎస్ మిలటరీ ప్రకటించింది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్ ఖైదాతో సంబంధం ఉన్న గ్రూపుతో అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులను హతమార్చాయని మిలటరీ పేర్కొంది. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్దరు సీనియర్ ఉగ్రవాదులేనని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.
అల్‌ఖైదాతో అనుబంధం ఉన్న హుర్రాస్ అల్-దీన్ గ్రూపునకు చెందిన సీనియర్ మిలిటెంట్‌తో పాటు మరో 8 మందిని లక్ష్యంగా చేసుకుని వాయువ్య సిరియాపై దాడి చేసినట్లు సైన్యం తెలిపింది. సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత అతనిదేనని వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో సెప్టెంబరు 16 నుంచి వైమానిక దాడులను ప్రకటించారు. సెంట్రల్ సిరియాలోని రిమోట్ ప్రదేశంలో ఐఎస్ఐఎస్ శిక్షణా శిబిరంపై పెద్ద ఎత్తున వైమానిక దాడిని నిర్వహించారు.
అమెరికా వైమానిక దాడిలో కనీసం 8 సిరియన్ నాయకులు సహా 28 మంది తీవ్రవాదులు హతమయ్యారు. “అమెరికా ప్రయోజనాలకు, అలాగే మా మిత్రదేశాలు, భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐఎస్ఐఎస్ సామర్థ్యానికి వైమానిక దాడి విఘాతం కలిగిస్తుంది” అని ప్రకటన పేర్కొంది. సిరియాలో దాదాపు 900 మంది సైనిక బలగాలను అమెరికా మోహరించింది. 2014లో ఇరాక్, సిరియాల మీదుగా విస్తరించి, పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.
Read Also : Mini Moon : ఖగోళ అద్భుతం.. నేటి నుంచి భూమికి ఇద్దరు చంద్రులు.. 2 నెలలు మనతోనే.. భారత్‌లో కూడా కనిపిస్తుందా?