45 Years Woman Get Ready Marriage 21 Years Man
Old Age Love Marriage : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ప్రవర్తించిందో మహిళ. దాదాపు తన కూతురు వయస్సున్న యువకుడిని నాలుగో పెళ్లి చేసుకోటానికి సిధ్దపడింది. ప్రియుడి వ్యామోహంలో పడి తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లోనుంచి గెంటి వేసింది. ఉత్తర ప్రదేశ్ లోని భిండ్ జిల్లా ఝూన్సీ మొహల్లా గ్రామంలో ఈవింత సంఘటన చోటు చేసుకుంది.
ఝూన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ 21 ఏళ్ల మిథున్ అనే యువకుడితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారిద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే తల్లి వ్యవహారాన్ని కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఈక్రమంలో తనను వ్యతిరేకిస్తున్న రెండో కుమార్తెను ఏడాది క్రితం ఇంటినుంచి తరిమివేసింది. ఇప్పుడు తన ప్రియుడితో పెళ్లికి సిధ్ధమయ్యింది.
ఈ వివాహానికి అడ్డుచెపుతున్న నలుగురు కుమార్తెలను ఇంటినుంచి తరిమివేసింది. తల్లి వ్యవహార శైలి నచ్చని ఆడపిల్లలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరినీ పోలీసు స్టేషన్ కు పిలిచారు. యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ తో ఆయువకుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు.