Thane
Building Collapse మహారాష్ట్ర థానే జిల్లాలోని కల్వా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సోమవారం కొండచరియలు విరిగిపడి బండరాళ్ల వచ్చిపడడంతో ఓ ఇల్లు కూలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఐదుగురు దుర్మరణం పాలయ్యారని థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. అయితే శిథిలాల కింద చిక్కుకుపోయినఇద్దరిని రక్షించినట్లు తెలిపారు. కాగా, వర్షాలకు కొండచరియలు విరిగిపడడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక,ఇవాళ ఉదయం కల్వా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన కారణంగా నాలుగు ఇళ్లు డ్యామేజ్ అయ్యాయి. భారీగా కురుస్తున్న వర్షాలతో థానే, పాల్ఘర్ జిల్లాల్లోని వసై, భీవండి, ముర్బాద్ పట్టణాల్లో వంతెనలు నీటమునిగాయి. దీంతో ట్రాఫిక్ కు పెద్ద ఎత్తున అంతరాయం కలిగింది.