Covid Cases In Mumbai : ముంబైలో భారీగా కోవిడ్ కేసులు

భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24

Covid Cases In Mumbai : ముంబైలో భారీగా కోవిడ్ కేసులు

Mumbai

Updated On : December 31, 2021 / 7:50 PM IST

Covid Cases In Mumbai : భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్ వేవ్,సెకండ్ వేవ్ సమయంలో కేసులు భారీగా నమోదైన మహారాష్ట్రపై కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 8,067 కొత్త కోవిడ్ కేసులు,8 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. గురువారంతో పోల్చితే 50శాతం కేసులు పెరిగినట్లు తెలిపింది. గురువారం రాష్ట్రంలో 5,368 కోవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు ముంబైలోనే నమోదయ్యాయి. ముంబైలో ఇవాళ 5,428 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోల్చితే కేసుల సంఖ్య 47శాతం పెరిగింది. గురువారం ముంబైలో 3,671 కోవిడ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ALSO READ Sunil : రాజా రవీంద్రతో నాకు ఎలాంటి గొడవ అవ్వలేదు.. కాని.. : సునీల్