రికార్డు : కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసిన చిన్నారి

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 08:29 AM IST
రికార్డు : కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్ క్యూబ్ సాల్వ్ చేసిన చిన్నారి

Updated On : November 24, 2019 / 8:29 AM IST

రూబిక్ క్యూబ్ గురించి తెలిసే ఉంటుంది కదా. పిల్లల మేథస్సుకు పదును పెట్టే ఆట వస్తువుల్లో ఇది కూడా ఒకటి. పిల్లలకే కాదు..పెద్దలకు కూడా. దీనిని కరెక్టుగా చేస్తే తాను మేధావని అనే ఫీలింగ్ వస్తుంది. కానీ కళ్లకు గంతలు కట్టుకుని దీనిని పూర్తి చేస్తారా ? కళ్లు తెరుచుకుని చేయలేం..ఇంకా గంతలు కట్టుకోనా ? అంటూ ఆశ్చర్యపోతుంటారు కదా. కానీ ఓ ఆరేళ్ల చిన్నారి ఈ ఘనతను సాధించి రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో ఆ చిన్నారి ప్రదర్శన చేసి అదరగొట్టింది. ఈమెను యంగెస్ట్ జీనియస్‌గా ప్రకటించారు. 

తమిళనాడు రాష్ట్రంలో సి.సారా. ఈ చిన్నారికి ఆరేళ్ల వయస్సు ఉంటుంది. చిన్నప్పటి నుంచే యాప్టిట్యూడ్ ప్రశ్నలను సాల్వ్ చేయడం చాలా ఇష్టం. ఎలాంటి ప్రశ్నలిచ్చినా..అవలీలగా సాల్వ్ చేసేది. దీంతో తల్లిదండ్రులు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయమని ఇచ్చారు. అంతేగాకుండా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించారు. 2×2 రూబిక్ క్యూబ్ స్పీడ్‌గా సాల్వ్ చేసేది. రికార్డు సాధించే దిశగా ప్రయత్నాలు చేసింది ఈ చిన్నారి సారా.
Read More : ఇలాగైనా తగ్గుతుందని : ఢిల్లీలో కాలుష్యం..నీటిని చల్లుతున్న ఫైర్ సర్వీసెస్

 

2019, నవంబర్ 22వ తేదీ శుక్రవారం ఓ ప్రదర్శన చేసింది.
కళ్లకు గంతలు కట్టుకుని రూబిక్ క్యూబ్ చేతపట్టింది.
స్పీడ్ స్పీడ్‌గా చేతులు కదుపుతూ సాల్వ్ చేస్తున్న విధానాన్ని చూసి అక్కడకు వచ్చిన వారందరూ ఆశ్చర్యపోయారు.
పద్యాలు వల్లెవేస్తూ..చిట్టి చేతులతో క్యూబ్‌ను చకచకా కదుపుతూ…కేవలం 2.7 నిమిషాల్లోనే చేసి రికార్డు సృష్టించింది.
తమిళనాడు క్యూబ్ అసోసియేషన్ సారాను వరల్డ్ యంగెస్ట్ జీనియస్‌గా ధృవపరుస్తూ..పత్రాన్ని అందచేసింది. ఇక సారా గిన్నీస్ వరల్డ్ రికార్డే లక్ష్యమని సారా తండ్రి వెల్లడించారు. 
రూబిక్ క్యూబ్‌ని 1974లో ఎర్నో రూబిక్ కనుగొన్నారు. 
మొదట్లో దీనిని మ్యూజికల్ క్యూబ్ అనేవారు. 
అప్పటి నుంచి ఇది 2×2, 3×3, 2x2x2, 3x3x3 ఇలా వివిధ పరిణామాల్లో లభిస్తుంది. 
కానీ సైజు పెరిగిన కొద్ది సాల్వ్ చేయడం కష్టతరంగా ఉంటుంది. 
చైనాకు చెందిన ఓ చిన్నారి రూబిక్స్ క్యూబ్‌ని సాల్వ్ చేసి గిన్నీస్ బుక్ రికార్డు నమోదు చేశారు.