ఎన్డీఆర్ఎఫ్ అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా పూణే జిల్లా అంబేగావ్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల బాలుడు బిల్ ను ఎన్డీఆర్ ఎప్ అధికారులు ఎట్టకేలకు రక్షించారు. ఫిబ్రవరి 20 సాయంత్రం ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంటున్న బిల్ అనే 6 ఏళ్ల బాలుడు 200 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. దీంతో బిల్ తల్లిదండ్రులు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు.. సహాయక చర్యలు చేప్పట్టారు.
20వ తేదీ రాత్రంతా బోరు బావిలోకి ఆక్సిజన్ పంపుతూ ..బిల్ పడిపోయిన బావికి సమాంతరంగా మరో గొయ్యిని తవ్వారు. 16 గంటల సుదీర్హ యత్నం తరువాత పిల్లాడిని సురక్షితంగా బయటకు తీశారు. తమ కుమారుడు సురక్షితంగా బయటపడాలని కళ్లల్లో ఒత్తులు వేసుకుని రాత్రంతా దేవుడిని ప్రార్థింతిచిన వారి ప్రార్థనలు ఫలించాయనీ అధికారులకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బిల్ ఆరోగ్యంగా ఉన్నాడనీ.. ఎటువంటి గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.