7 Army Soldiers Died In Vehicle Accident In Ladakh Turtuk (2)
Accident In Ladakh’s Turtuk : జమ్మూకశ్మీర్ లోని లద్ధాఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.తుర్తుక్ సెక్టార్ వద్ద ఆర్మీ వాహనం నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందారు. పలువురు సైనికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాయపడిన వారికి వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నుండి వైమానిక మద్దతు కోరినట్లు వారు తెలిపారు.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా తీవ్ర గాయాలపాలైన సైనికులను ఆస్పత్రులకు తరలించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
26 మంది జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం తుర్తుక్ సెక్టార్ వద్ద అదుపుతప్పి షియోక్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో 19మంది జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స కోసం పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ హాస్పిటల్‌కు తరలించారు. వాహనం దాదాపు 50-60 అడుగుల లోతులో పడిపోయింది. 26 మంది సైనికులతో కూడిన బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుంచి సబ్ సెక్టార్ హనీఫ్ కు వెళ్తోంది.
వాహనం వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డుపై నుండి జారి షియోక్ నదిలో పడిపోయింది.