పండుగ రోజు తీవ్ర విషాదం.. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు

కుటుంబాన్ని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ డ్రైవరును తప్ప మిగతా వారిని వారు కాపాడలేకపోయారు.

పండుగ రోజు తీవ్ర విషాదం.. ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు

Accident

Updated On : October 12, 2024 / 2:29 PM IST

దసరా పండుగ వేళ హరియాణాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని కైతాల్ జిల్లాలోని ముండ్రి గ్రామ సమీపంలో ఓ కుటుంబం కారులో వెళ్తుండగా అది అదుపుతప్పి రోడ్డుపై నుంచి కాలువలో పడిపోయింది.

దీంతో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. దసరా పండుగ రోజు నిర్వహించే బాబా రాజ్‌పురి మేళాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

కాలువలో పడిపోయిన కుటుంబాన్ని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ డ్రైవరును తప్ప మిగతా వారిని వారు కాపాడలేకపోయారు. ఈ ఘటనలో కాలువలో పడిన మరో చిన్నారిని నీళ్లలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అతడి ఆచూకీ కోసం పోలీసులు, సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

ఖాన్ సాబ్‌కు ఎంత కష్టం వచ్చే.. అధికార పార్టీలో ఉన్నా పోరాటమేనా!