Indian Navy Band : నేవీ వార్మ్ అప్ ఎక్సర్ సైజ్.. బాలీవుడ్ పాటకు డ్యాన్స్

వార్మ్ అప్ ఎక్సర్ సైజ్ లో భాగంగా బాలీవుడ్ పాట "దునియా మే లోగాన్ కో" పాటకు లయబద్ధంగా డ్యాన్స్ లు చేశారు. ఈ పాటను ఆర్డీ బర్మన్, ఆశా భోంస్లే పాడారు. కానీ...

India Navy

Duniya Mein Logon Ko : దేశ సరిహద్దులో విధులు నిర్వర్తించే సైనికులు డ్యాన్స్ లు చేసే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కుటుంబాన్ని వదిలి..దేశానికి సైనికులు అందిస్తున్న సేవలు ఎనలేనివి. వారు చూపించే సాహసం..త్యాగాలు చూసి దేశం పులకరిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కాస్తా రిలాక్స్ అవుతుంటారు. భక్తి, ఇతర పాటలకు అనుగుణంగా వీరు డ్యాన్స్ లు చేస్తుంటారు. చలికి గడ్డ కట్టే ప్రాంతంలో కాపాల కాస్తున్న సైనికులు బాలీవుడ్ పాటకు నృత్యం చేసిన వీడియో ఇటీవలే వైరల్ అయ్యింది.

Read More : Bhama Kalapaam : ‘అనుపమ’.. చాలా డేంజరస్ హౌస్ వైఫ్..

తాజాగా…నేవీ సిబ్బందికి సంబంధించిన వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. MyGovIndia ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. అందులో నేవీ సిబ్బందిలో కొంతమంది సంగీతం వాయిస్తుండగా..ఇతర సిబ్బంది చేతుల్లో రైఫిల్స్ పట్టుకుని కాళ్లు అటూ ఇటూ కదిపారు. అక్కడున్న అధికారులు వారిని ఉత్సాహ పరిచారు. అప్పడప్పుడు స్లో మోషన్ లో రూపొందించిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకొంటోంది.

Read More : Coronavirus: వచ్చే 14రోజుల్లో గరిష్టస్థాయికి కరోనా కేసులు.. బీ-కేర్‌ఫుల్! – ఐఐటీ నిపుణులు

కొద్ది రోజుల్లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగనున్నాయి. ఇందులో పాల్గొనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది ముందుగానే రిహార్సల్ చేస్తుంటాయి. న్యూఢిల్లీలోని విజయ్ చౌక్ లో భారత నావికాదళ సిబ్బంది నేవీ యూనిఫాం ధరించారు. వార్మ్ అప్ ఎక్సర్ సైజ్ లో భాగంగా బాలీవుడ్ పాట “దునియా మే లోగాన్ కో” పాటకు లయబద్ధంగా డ్యాన్స్ లు చేశారు. ఈ పాటను ఆర్డీ బర్మన్, ఆశా భోంస్లే పాడారు. కానీ..రిపబ్లిక్ డే వేడుకల్లో భాగం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.